శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమ

                              
                                                    
                                                                  
                        శ్రీకాళహస్తి పట్టణం చిత్తూర్ జిల్లలో ఆంధ్ర ప్రదేశ్ రాస్త్ర్హం లోనిది.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు కేవలం 40 కిలోమీటర్లు దూరంలో వెలసినది.పట్టణమునకు మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ రేణిగుంట గూడూర్ మార్గం కలదు. ఈ క్షేత్రంను చేరుకొనుటకు దేశంలోని అన్ని వైపుల నుండి బస్సు,రైలు ,విమాన సౌకర్యాలు గలవు


                                             చారిత్మాక ప్రాశస్త్యం

క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను  శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు
                                                                            http://thesrikalahasthitemple.blogspot.in