వాయులింగం

                                                 వాయులింగం
  పంచభూత లింగములో శ్రీకాళహస్తిశ్వర లింగం వాయులింగంగా ప్రఖ్యాతి గాంచినది.కంచిలో ఎకంబరేశ్వరుడు,ప్రుద్విలింగంగా,తిరుచ్చిరాప్పల్ల మధ్య తిరువానైక్కావాల్ లేక శ్రీరంగంకు దగ్గరలోని జంబుకేశ్వరమున జల లింగం,అరుణచలంలో తేజో లింగం,శ్రీకాళహస్తి లో వాయు లింగంగా,చిదంబరంలో ఆకాశలింగంగా వెలసినవి ప్రతీతి. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలోనే యుండి మహాయోగులకు స్పర్సమాత్రమునే గ్రహింపదగి యుండిడివాడట.త్రేతాయుగంలో స్వర్ణరూపం,ద్వారప యుగంలో రజత రుపంను,ప్రస్తుత కలియుగంలో శ్వేత శిలా రూపమును పొంది తన సహజ వాయుతత్వ నిదర్సనముగా గర్బలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపముల రెండిటిని ఎల్లప్పుడూ చలింప చేయుచుండుట గమనింపదగినవి


                                              గోపురములు
 ఈ అలయంకు నాలుగు దిక్కులలోను గోపురములు కలవు.ఇవిగాక రాజగోప్రురము సుమారు 120 అడుగుల ఎత్తుగలది ఒకటి కలదు.దీనిని శ్రీ కృష్ణదేవరాయలు 1516 లో కట్టించినట్లు శాసన ప్రమాణం కలదు.స్వామివారి గ్రామోత్సవంకు పోవునప్పుడు ఈ గోపురం నుండే వచ్చును.ఆలయం జేరుకోనుటకు ముందు తేరు విధి కెదురుగా నుండు భిక్షాల గోపురం నుండియే వచ్చును.జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిక్షాలు దీనిని కట్టించినట్లు చెప్పబడింది.ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగినట్లు చెప్పబడుతుంది.ఈ గోపర నిర్మాణం యాదవ నరసింహ రాయల కాలంలో జరిగి నట్లు  చెప్పుదురు

     తుర్ఫువైపున ఆలయప్రవేశద్వారముగా బాలజ్ఞానంబ గోపురం కలదు. ఉత్తరం వైపునున్న గోపురంను సూర్య పుష్కరిణి,కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకమునకు,వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి,కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకంనకు,వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి నుండియే తీసుకోని పోబడును.ఈ గోపురము నుండి సువర్ణ ముఖినదికి పోవచ్చును.దక్షిణ వైపునున్న గోపురం ద్వార కన్నప గుడికి,బ్రహ్మగుడికి పోవచ్చును

No comments:

Post a Comment