శ్రీ జ్ఞాన ప్రసునాoభికాదేవి

                                      శ్రీ జ్ఞాన ప్రసునాoభికాదేవి
 
                   
పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రములను భోదించి నిశ్చల చిత్తంతో జపింపవలయుననెను. జపము సేయునప్పుడు ఆమెకు మందబుద్ది ఆవరించి నియమం విస్మరించెను.అపుడు శివుడు కోపించి ఆమెను భూమిఫై మానస్త్రీగా అవుతావని శపించెను.అపుడామే శాపవిమోచనకై శివుని ప్రాద్దింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పుజించమని అనతిచ్చెను.పార్వతి దేవి నారదుని సాయంతో భూమికి వచ్చి ఘోర తపంబాచరించెను.శివుడు ప్రతక్ష్యమయ్యేను.ఆమెను తన అర్ధాంగమున అర్ధనారిశ్వరత్వమున నిలుపుకొనెను.అప్పటి నుండి ఆమె జ్ఞానప్రసూనాంభిక అను పేరుతో శ్రీ కాళహస్తిశ్వరస్వామి వారి సన్నిధ్యమున వెలసినది.ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞానప్రదిప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనంబాయను పేరు సార్దక నామమై విరాజిల్లుతుంది

No comments:

Post a Comment